ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 10 ఆగస్టు 2022 (19:52 IST)

స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవకు గుండెపోటు

Raju Srivastava
Raju Srivastava
ప్రముఖ స్టాండప్ కమెడియన్ అయిన రాజు శ్రీవాస్తవ బుధవారం నాడు జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు ఈయన చేసినట్టు తెలుస్తుంది. అటు తర్వాత ట్రెడ్‌మిల్‌‌పై వర్కవుట్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు గుండె నొప్పి రావడంతో కుప్పకూలినట్టు సమాచారం. 
 
వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి గుండె తిరిగి బాగా పనిచేసేలా సీపీఆర్ చేశారట. రెండు సార్లు చేయడంతో పరిస్థితి నార్మల్ అయ్యింది అని వారు చెప్పుకొచ్చారు.