గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (14:40 IST)

ప్రముఖ బాలీవుడ్ నటు మిథిలేష్ చుతుర్వేది కన్నుమూత

Mithilesh Chaturvedi
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటుడు మిథిలేష్ చతుర్వేది (68) కన్నుమూశారు. బుధవారం సాయంత్రం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ లక్నోలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన అల్లుడు ఆశిష్ చతుర్వేది సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన మరణవార్త తెలిసిన అనేక  తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 
 
ఇకపోతే, ఆయన 1997లో వచ్చిన భాయ్ భాయ్ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే ఆయన అనేక అగ్ర నటీనటుల చిత్రాల్లో నటించి, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కోయి మిల్ గయా, ఏక్ ప్రేమ్ కథ, సత్య, బంటీ, క్రిష్, తాల్, రెడీ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 
 
ఈయ‌న ప‌లు టీవీ సిరీస్‌ల‌లోనూ న‌టించాడు. క‌యామ‌త్‌, సింధూర్ తేరే నామ్ కా, నీలి ఛ‌త్రి వాలే వంటి సిరీస్‌ల‌తో బుల్ల‌తెర ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేశాడు. ఈయ‌న చివ‌ర‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌-ఆయుష్మాన్ ఖురానా న‌టించిన ‘గులాబో సితాబో’ సినిమాలో న‌టించాడు.