గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (12:38 IST)

యువ హీరో పృథ్వీ అంబార్‌కు మాతృవియోగం

prithvi ambaar
"దియ" ఫేమ్ పృథ్వీ అంబార్‌ తల్లి సుజాత తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆమె బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. దీంతో పృథ్వీ ఇంట విషాదం నెలకొంది. ఆమె అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. ఆమె మృతివార్త తెలిసిన అనేక మంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 
 
కాగా, పృథ్వీ అంబర్ కన్నడ సీరియల్స్‌లో నటిస్తూ వెండితెరపైకి అడుగుపెట్టారు. గత 2020లో విడుదలైన "దియ" సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు ఆయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించేందుకు కమిట్ అయ్యారు. ఇదిలావుంటే, "దియ" చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తుండగా, ఇందులోకూడా ఆయన హీరోగా నటిస్తున్నారు.