గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నటుడు ఆర్.నారాయణమూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ మృతి

narayanamurthy
సీనియర్ సినీ నటుడు, దర్శక నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ మృతి చెందారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. 
 
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రెడ్డి చిట్టెమ్మకు ఏడుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు ఆర్.నారాయణమూర్తి. ఆమె మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.