శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (12:33 IST)

కోనసీమలో అగ్నిప్రమాదం.. గర్భిణీ కుమార్తెతో తల్లి సజీవహనం

కోనసీమలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన అల్లవరం మండల కొమ్మరగిరిపట్నం ఆకులవారి వీధిలో జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 
 
ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లికూరుర్లు సజీవదహనం అయ్యారు. వీరిని సాధనాల మంగాదేవి (40),మెడిశెట్టి జ్యోతి (23)గా గుర్తించారు. మరో విషాదం ఏమిటంటే మెడిశెట్టి జ్యోతి ఇప్పుడు గర్భవతి. ఈమె ఐదు నెలల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది. 
 
పెద్దలను కాదని తానిష్టపడ్డ వ్యక్తిని పెళ్లిచేసుకోవడం, గర్భవతి కావడంతో.. ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన  అల్లవరం పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.