1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (17:58 IST)

తల్లీతో పాటు ఆరేళ్ళ కుమార్తెపై అత్యాచారం.... ఎక్కడ?

rape
దేశంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోతుంది. బహిరంగ ప్రదేశాల్లోనేకాకుండా, తమ గృహాల్లో కూడా వారికి రక్షణ కరువైంది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌ సమీపంలోని రూర్కీలో ఓ మహిళతో పాటు ఆమె కుమార్తెపై అత్యాచారం జరిగింది. ఇక్కడ కూడా హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ తరహాలోనే కారులో అత్యాచార దారుణానికి ఒడిగట్టారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, రూర్కీకి చెందిన ఓ మహిళ తన ఆరేళ్ళ కుమార్తెను తీసుకుని రాత్రివేళ పిరాన్ కిలియార్ నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ కారు డ్రైవర్ సోను కాపు ఆపివారికి లిఫ్టు ఇచ్చాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత వారి స్నేహితులు కూడా కారు ఎక్కారు.
 
ఆ తర్వాత మహిళతో పాటు ఆరేళ్ళ చిన్నారిపై ఆ కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత తల్లీకుమార్తెలను దుండగులు కారు వద్ద పడేశారు. ఆ తర్వాత బాధిత మహిళ అర్థరాత్రి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటన గురించి వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుల కోసం గాలిస్తున్నారు.