ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (17:18 IST)

ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో కరెంట్ షాక్ ఇచ్చిన శాడిస్టు భర్త

woman victim
ఆధునికత మారినా.. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నా.. ఆడపిల్లలపై చిన్నచూపు చూసేవారు ఏమాత్రం మారట్లేదు. ఆడపిల్లలు వద్దనుకుంటున్న జనం ఇంకా వున్నారు. అలాగే ఆడపిల్ల పుడితే ఈసడించుకునే వారు కూడా వున్నారు. 
 
అయితే తాజాగా ఓ కిరాతకుడు ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో భార్యకు కరెంటు షాక్‌ ఇచ్చి మరీ హింసించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పెనమలూరుకు చెందిన శీలం రాజారత్నం, ప్రశాంతిలు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2014లో వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే రాజారత్నం పెళ్లైన కొద్దిరోజుల నుంచి ప్రశాంతిని వేధించడం మొదలుపెట్టాడు. 
 
అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. రాజారత్నం తండ్రి కూడా ఈ వికృతచర్యలకు వంత పాడేవాడు. ఇటీవలేలో తల్లిదండ్రుల నుంచి విడిపోయి కానూరులో వేరే కాపురం పెట్టారు. వీరికి తొలిసారి మగపిల్లాడు జన్మించాడు.
 
రెండో కాన్పులో ప్రశాంతి జనవరి 28న ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆడపిల్లను కన్నావని, కట్నం తీసుకురావాలని, లేకపోతే పుట్టింటికి వెళ్లిపోమని వేధింపులను మరింత తీవ్రతరం చేశాడు. 
 
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 రాత్రి ప్రశాంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతికి విద్యుత్ తీగచుట్టి స్విచ్‌ వేశాడు. దీంతో ప్రశాంతి విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు వేసింది. 
 
ఆమె అరుపులకు పక్కగదిలో ఉన్న ప్రశాంతి తల్లి వచ్చిచూడగా విద్యుత్తు వైర్లు కనిపించాయి. అప్పటికే రాజారత్నం పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మామలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.