ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జూన్ 2022 (13:21 IST)

మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో పేలుడు

blast
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లిలో శనివారం పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా బహదూర్ పల్లిలోని ఒక కన్వెన్షన్ హాలులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నమహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈమెను కామారెడ్డికి చెందిన లక్ష్మిగా గుర్తించారు. ఈమె తన భర్త జయరాజ్‌తో కలిసి బహుదూర్ పల్లిలోని ఎస్‌బీ‌వీ‌కే ఫంక్షన్ హాలులో సెక్యూరిటీ ఉంటూ పని చేస్తున్నారు.
 
శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ డబ్బాను కడిగేందుకు లక్ష్మి ప్రయత్నించగా… ఆ డబ్బా నుంచి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆమె శరీరం ఛిద్రమై రక్తపు మడుగులో పడి చనిపోయింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు క్లూస్ టీం తో ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. డబ్బాలో ఏముంది అనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.