మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మే 2022 (14:05 IST)

ఉత్తర కొరియాలో కరోనా స్వైర విహారం

pneumonia after corona
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. కఠిన లాక్డౌన్లు పెట్టినా, క్వారంటైన్ రూల్స్‌ను అమలు చేసినా.. ఆ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. అలా మూడు రోజుల్లో ప్రవేశించిన వైరస్ ఇపుడు శరవేగంగా వ్యాపించింది. ఫలితంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్పటివరకు 8,20,620 కేసులు నమోదు కాగా.. బాధితుల్లో 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ మరో 15 మంది ‘జ్వరం’ వల్ల చనిపోయారంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది. 
 
కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశమంతా లాక్ డౌన్ విధించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు, కౌంటీల్లో లాక్ డౌన్ కొనసాగుతోందని ఆ దేశ అధికారిక పత్రిక కేసీఎన్ఏ వెల్లడించింది. పని ప్రాంతాలు, ఉత్పత్తి యూనిట్లు, నివాస సముదాయాలన్నింటినీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మూసేసినట్టు పేర్కొంది.