1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (09:26 IST)

పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై గ్రనేడ్‌తో దాడి..

grenade attack
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పాలన సాగుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు తెలుస్తోంది. నిషేధిత ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆగడాలు హెచ్చరుమీరిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ రాష్ట్ర నిఘా విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ ఆధారిత గ్రనేడ్ దాడి జరిగింది. ఈ గ్రనేడ్‌ను డ్రోన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. 
 
స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ కార్యాలయంలోని ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ రాకెట్ ఆధారిత గ్రనేడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడితో అప్రమత్తమైనద పోలీసులు పరిస ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అయితే, ఈ దాడిపై పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇదేమీ ఉగ్రదాడి కాదన్నారు. పేలుడు మాత్రమేనని చెప్పారు. దాడి కారణంగా కార్యాలయంలోని మూడో అంతస్తులో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి భగత్ సింగ్ మాన్ ఉన్నాతధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.