1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. North Korea reports six deaths after admitting COVID-19 outbreak

ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు.. ఐసోలేషన్‌లో 1,87,800 మంది

north korea
ఉత్తర కొరియా దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడని కరోనా వైరస్ తాజాగా వెలుగు చూసింది. ఆ దేశంలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో 1,87,800 మందిని ఐసోలేషన్‌లోకి పంపించారు. అలాగే, జ్వరం కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో నార్త్ కొరియా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జ్వరంలో చనిపోయిన ఆరు మృతదేహాలకు వైద్య పరీక్షలు చేయగా, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మృతదేహంలో ఒమిక్రాన్ బీఏ-2ను గుర్తించారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వారందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. ఇప్పటికే నార్త్ కొరియాలో అత్యవసర పరిస్థితితో పాటు లాక్డౌన్ విధించారు. 
 
ఉత్తర కొరియా వాసుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా టీకా వేసుకోలేదు. వారికి టీకాలు సరఫరా చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినప్పటికీ నార్త్ కొరియా అధిపతి కిమ్ జాంగ్ ఉన్ వద్దని తిరస్కరించారు. 
తర్వాతి కథనం
చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... 12 మంది అరెస్టు