ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (10:23 IST)

షాంఘైలో లాక్‌డౌన్: ఒమిక్రాన్‌తో ఇద్దరు మృతి

 corona
చైనాలో కరోనా విజృంభిస్తోంది. గత కొన్నాళ్లుగా షాంఘై లాక్‌‌డౌన్‌లో మగ్గుతోంది. తొలిసారిగా షాంఘైలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో 89,91 ఏళ్ల వయస్కులని.. వారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. కరోనా మలిదశలో చైనాలో కరోనా మరణాలు నమోదవడం ఇది రెండోసారి. గత నెలలో జిలిన్‌ ప్రావిన్స్‌లో మహమ్మారికి ఇద్దరు బలయ్యారు.
 
ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణతో చైనాలో షాంఘై కరోనాకు కేంద్రంగా మారింది. నగరంలో మార్చి మొదటివారం నుంచి ఇప్పటివరకు 3 లక్షల 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి స్థానిక ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ను అమలుచేస్తుంది.