1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (19:38 IST)

చైనాలో కరోనా కల్లోలం - లాక్డౌన్ ప్రాంతాల్లో రోబోలతో ప్రచారం

కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇపుడు కరోనా కల్లోలం సృష్టిస్తుంది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలుచేస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా, మరింత జాగ్రత్తగా ఉండాలంటూ రోబోలతో ప్రచారం చేయిస్తున్నారు. 
 
ముఖ్యంగా, చైనాలోని ప్రధాన నగరాల్లో షాంఘై ఒకటి. ఇక్కడ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో షాంఘై వీధుల్లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అధికారులు రోబోల సాయంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. 
 
ప్రజలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెబుతూ, ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ తమతమ గృహాల్లోనే ఉండాలని, ఎవరూ బయటకురావొద్దని హెచ్చరికలు చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.