బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 మార్చి 2022 (21:43 IST)

క్షయ పరీక్షల ప్రచారంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్న దేశీయ సాంకేతికత ట్రూనాట్‌

భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు నుంచి మూడు వారాల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఈ వ్యాధి బారిన పడేందుకు అవకాశం ఉన్న ప్రజలతో పాటుగా ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిని పరీక్షించనున్నారు.

 
దేశీయంగా అభివృద్ధి చేసిన ట్రూనాట్‌ ఫ్లాట్‌ఫామ్‌ను దేశీయంగా ఈ పరీక్షలను చేయడం కోసం ముందస్తు ఉపకరణంగా ఉపయోగించనున్నారు. ఈ ట్రూనాట్‌ సాంకేతికతను 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో మొట్టమొదటి పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ ర్యాపిడ్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్‌ వేదికగా టీబీ నిర్ధారణ- బహుళ ఔషదాల ప్రతిరోధక పరీక్షల కోసం గుర్తించింది.

 
ఈ కార్యక్రమం గురించి మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో శ్రీ శ్రీరామ్‌ నటరాజన్‌ మాట్లాడుతూ, ‘‘భారతప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ టీబీ పరీక్ష కార్యక్రమంలో పాలుపంచుకుంటుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. లక్షణాలు కలిగిన వ్యక్తులతో పాటుగా ఈ వ్యాధిని తీసుకువెళ్లే ప్రతి ఒక్కరినీ పరీక్షించడం అత్యంత కీలకం. ఈ వ్యాధి నిర్మూలన కోణంలో ఇంటింటికీ పరీక్షలు చేయడం అత్యంత కీలకమైన ముందడుగు. ట్రూనాట్‌తో మార్పు తీసుకురాగలమని భావిస్తున్నాము’’ అని అన్నారు

 
మొల్బియో డయాగ్నోస్టిక్స్‌ కో-ఫౌండర్‌ అండ్‌ సీటీఓ డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయర్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో అతి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా క్షయ నిలుస్తోంది. ప్రపంచంలో నాలుగోవంతు క్షయ రోగులు ఇక్కడే ఉన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా దీని నిర్మూలనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంటింటికీ పరీక్షలతో టీబీ నిర్మూలన దిశగా మరో ముందడుగు వేయనున్నాము. ఇప్పటికే దాదాపు 70% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో ఉండటంతో పాటుగా నాణ్యమైన నిర్ధారణ పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. కానీ ట్రూ నాట్‌తో గ్రామీణ ప్రాంత వాసులు కూడా మెరుగైన సేవలను పొందగలరు’’ అని అన్నారు.