మంగళవారం, 16 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (22:26 IST)

చిన్నారులు- పెద్ద వయసు వారి కోసం మణిపాల్‌ హాస్పిటల్ ఉచిత వినికిడి పరీక్షల శిబిరం

ప్రపంచ వినికిడి దినోత్సవ సందర్భంగా చిన్నారులు- పెద్దలకు ఉచిత వినికిడి పరీక్షలను నిర్వహించేందుకు ఆరోగ్య శిబిరాన్ని మణిపాల్‌ హాస్పిటల్‌, విజయవాడ నిర్వహించబోతుంది. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులు- పెద్దలకు నాణ్యమైన జీవితాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని నిర్వహించబోతున్నారు.

 
ఈ ఉచిత ఆరోగ్య శిబిరానికి డాక్టర్‌ వెంకట కృష్ణ సందీప్‌, కన్సల్టెంట్‌- ఈఎన్‌టీ, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ, కోక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జన్‌- డాక్టర్‌ జయ కృష్ణ అన్నె, కన్సల్టెంట్- ఈఎన్‌టీ, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ నేతృత్వం వహించనున్నారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరం మార్చి 3న మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగనుంది.

 
ఈ శిబిరం గురించి కన్సల్టెంట్‌- ఈఎన్‌టీ హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ డాక్టర్‌ వెంకటకృష్ణ సందీప్‌ మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర వ్యాప్తంగా వినికిడి లోప సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు- పెద్దలకు నిర్వహించబోతున్న ఉచిత వినికిడి పరీక్షల ఆరోగ్య శిబిరంలో పాల్గొనడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నరాల సంబంధిత  వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులు, పెద్దల కోసం కోక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ను చేయనున్నాం. ఇప్పటివరకూ మేము ఐదేళ్ల లోపు చిన్నారులు ఎనిమిది మందితో పాటుగా 57 సంవత్సరాల వయసు కలిగిన ఓ వ్యక్తికి కూడా ఈ శస్త్ర చికిత్సలు చేశాం. చిన్నారులకు మెరుగైన జీవితం అందించాలన్నది మా అంతిమ లక్ష్యం. ఎందుకంటే భవిష్యత్‌లో వారి మెరుగైన ప్రదర్శనకు వైకల్యమనేది అడ్డుగోడగా నిలువరాదు’’ అని అన్నారు.

 
కన్సల్టెంట్-ఈఎన్‌టీ, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ డాక్టర్‌ జయకృష్ణ అన్నె మాట్లాడుతూ, ‘‘ఈ ఆరోగ్య శిబిరం ద్వారా నగరం చుట్టు పక్కల ప్రాంతాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువై అందుబాటులోని అత్యుత్తమ సంరక్షణ, సదుపాయాలను అందించనున్నాం’’ అని అన్నారు.

 
మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ, హాస్పిటల్‌ డైరెక్టర్‌  డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ, ‘‘ఈ ఉచిత వినికిడి పరీక్షల ఆరోగ్య శిబిరం నిర్వహిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ శిబిరం ద్వారా ప్రజల వినికిడి సవాళ్లకు తగిన పరిష్కారం అందిస్తున్నాము. మా ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్‌లో పలు వినికిడి లోప సమస్యలకు మెరుగైన చికిత్సనందించేందుకు అవసరమైన అత్యాధునిక యంత్రసామాగ్రి ఉంది. దీని ద్వారా వినికిడి కోల్పోయి ఇబ్బంది పడుతున్న యువతరానికి తగిన చికిత్సలనందించగలము. అంతేకాదు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ పథకాలకు అర్హులైన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు’’ అని అన్నారు.