ఒక్కసారిగా 7 కోట్లు పెంచేసిన రవితేజ?
రవితేజ ఖిలాడి సినిమా గత శుక్రవారం విడుదలై విసుగుపుట్టించిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఏ మాత్రం ఆసక్తికరమైన కథలేకపోవడంతో స్టయిలిష్‌గా సినిమా వుంటుందని మొదటినుంచి దర్శకుడు రమేష్ వర్మ, నిర్మాత కోనేరు సత్యనారాయణ చెబుతూనే వున్నారు. ఈ సినిమా దర్శకుడికి రావడానికి కారణం నిర్మాత అంతకుముందు రాక్షసుడు అనే సినిమాను ఆయనతో చేయడమే. ఆ సినిమా తమిళ రాక్షసన్‌ను దించేశాడు. అయితే ఆ సినిమాను మొదట హీరో వేరే. కానీ షడెన్గా తెరపై బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చాడు. సో. ఇదిలా వుండగా, ఈ దర్శకుడు ఇచ్చిన సక్సెస్ కిక్‌తో నిర్మాత అతనితో రెండు సినిమాలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. మాటకు కట్టుబడి న వ్యక్తిగా పేరుపొందిన సత్యనారాయణ అలాగే ఖిలాడి చేశాడు.
ముందు ఈ కథను రవితేజతోనే చేయాలని నిర్మాత పట్టుబట్టారు. ఆయన రవితేజ ఫ్యాన్. కానీ అందుకు సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకోలేదని తెలిసింది. గతంలో ఆ దర్శకుడి కాంబినేషన్‌లో `వీర`అనే డిజాస్టర్ తీశాడు. అలాంటిది మరోసారి ఇతనికి ఎందుకు అవకాశం ఇచ్చాడనే టాక్ నెలకొంది. కరోనా ముందు జరిగిన ఈ \లావాదేవీల బట్టి రవితేజకు 7కోట్లు ఇవ్వడానికి నిర్మాత సిద్ధమయ్యాడు. అందుకు అంగీకరించాడు హీరో. కానీ రాను రాను కరోనా వల్ల వాయిదాడడం, రాక్షసుడు హిందీ రైట్స్ కూడా అమ్ముడుకావడంతో మంచి లాభాలు తెచ్చిపెట్టాయి నిర్మాతకు. ఈ మార్కెట్ అంతా దర్శకుడు రమేష్ వర్మ చూసుకున్నాడు. దాంతో దర్శకుడిపై ఆయనకు మరింత నమ్మకం ఏర్పడింది.
అలాగే ఖిలాడి సినిమాను కూడా బిజినెస్‌పరంగా అన్నీ దర్శకుడే ప్లాన్ చేశాడు. ఖిలాడి షూటింగ్‌కు నిర్మాత కూడా రాలేదు. అంతా ఆయనపై భారం వేశాడు. అంతగా నమ్మిన నిర్మాత దర్శకుడికి 50లక్షల కొత్త కారు కొని గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. ఇది రవితేజకు ఆశ్చర్యం కలిగిందని టాక్ వుంది. షూటింగ్ మధ్యలో వుండగానే రవితేజ 7కోట్లనుంచి 14కోట్లు డిమాండ్ చేశాడని వార్త వినపబడింది. దానికి నిర్మాత సిద్ధమయ్యాడు. సగానికిపైగా షూటింగ్ అయింది. పెట్టిన పెట్టుబడి బూడిద పాలు అవుతుందని తెలుసుకుని అంతా దర్శకుడిపై భారం వేశాడు నిర్మాత. ఆ తర్వాత రవితేజతో సంప్రదింపులు జరిపి మొత్తంగా 14కోట్ల ఇచ్చేందుకు ప్రిపేర్ చేశాడని విశ్వసనీయ సమాచారం.
కానీ ఆ రత్వాత మరింత గేప్ దర్శకుడికి, రవితేజకు వచ్చింది. ఇటలీలో షూటింగ్ చేస్తుండగా షూటింగ్‌కంటే హీరోయిన్లతో షాపింగ్ చేయడంపై ఎక్కువ కాన్‌సన్ ట్రేషన్ చేశాడనీ ఒకరిపై ఒకరు నిర్మాతకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు కరోనా వేవ్ వల్ల షెడన్‌గా అక్కడ టీమ్ ఇరుక్కుపోయింది. ఇలా సినిమాకు అనుకున్న బడ్జెట్‌కంటే 15కోట్లు ఎక్కవయిందని తెలిసింది. ఈ పరిణామంతో దర్శకుడు రమేశ్ వర్మ, రవితేజకు కూడా పడటం లేదని వినవచ్చింది. అది నిజమని యూనిట్ సభ్యులు కన్ ఫామ్ చేశారు. ఆరంభంలో బాగానే ఉన్న వీరిమధ్య ఎందుకు వివాదాలు చోటు చేసుకున్నాయి.
నిజానికి కరోనా కంటే ముందు కమిట్ అయిన సినిమా ఇది. అప్పటి మార్కెట్ ప్రకారం రవితేజతో రేటు మాట్లాడుకున్నారు. అది అటు ఇటు మారి చివరకు పారితోషికం రూ.12 కోట్లకు పెరిగింది. . దాని తర్వాత ఖిలాడి బడ్జెట్ రూ.35 కోట్లు. అనుకున్నారు. కానీ కరోనా బ్రేక్స్ వల్ల… డైరెక్టర్ అసమర్థత వల్ల నెంబరాఫ్ షూటింగ్ డేస్ పెరిగాయి. ఫలితంగా బడ్జెట్ రూ.50 కోట్లకు పైగా చేరింది. క్రాక్ హిట్ కావడంతో రవితే పేరుతో ఖిలాడి కూడా హిందీ డబ్బింగ్ రైట్స్ ఇతర డిజిట్ రేట్స్ బాగానే దర్శకుడు వర్కువట్ అయ్యేలా చేశాడు. దాంతో నిర్మాతకు పెద్దగా లాస్ అనిపించలేదు.
ఆ తర్వాత హీరో, దర్శకుల మధ్య తేడా కలిగింది. 80 రోజులు షూటింగ్ అనుకుని దాదాపు 125 రోజులు పని చేయడం, దర్శకుడి లో కంట్రోల్ లేకపోవడం వంటివల్లే బడ్జెట్ పెరిగిందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఖిలాడీ విడుదలకుముందు కూడా నిర్మాత అన్నీ దర్శకుడే చూసుకుంటున్నారు. నేను షూటింగ్ కు కూడా పెద్దగా వెల్ళలేదు. ఇలాంటి దర్శకుడితో మరో సినిమా కూడా చేస్తానని ప్రకటించాడు. ఇవన్నీ గమనిస్తున్న రవితేజకు ఆశ్చర్యం కలిగింది. అందుకే ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ నిర్మాతలు దగ్గరుండి చూసుకోవాలి అని దర్శకుడి నుద్దేశించి అన్నారు. అసలు ఖిలాడి సినిమా చేయడానికి కారణం రచయిత అంటూ ఆయన్ను పరిచయం చేసి హైలట్ చేశాడు. ఎక్కడా దర్శకుడి గురించి మాట్లాడలేదు. కేవలం మహర్‌జాతకుడికి మాత్రమే లక్ వుంటుందంటూ ఇన్‌డైరెక్ట్‌గా దర్శకుడి గురించి అన్నాడు. +
ఏది ఏమైనా సినిమారంగంలో హీరో, దర్శకుడి మధ్య వున్న సంబందాలు ఒకప్పుడు బాగుండేవి. కానీ రాను రాను పక్కా కమర్షియల్‌గా మారి నిర్మాత అనేవాడిని భయపడేలా చేస్తున్నారు. ఈ విషయాన్ని పలు సార్లు రామానాయుడుగారు ప్రస్తావించిన సందర్భాలు కూడా వున్నాయి.