సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (17:21 IST)

రవితేజ రావణాసుర రెండవ షెడ్యూల్ పూర్తి

Ravanasura team
మాస్ మహారాజా రవితేజ,  క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర. ఇటీవ‌లే విడుద‌ల‌చేసిన‌ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
సుశాంత్‌తో పాటు మరికొందరు నటీనటులు మొదటి షెడ్యూల్‌లో పాల్గొంటుండగా, రవితేజ ఇటీవ‌లే రెండో షెడ్యూల్‌లో షూట్‌లో జాయిన్ అయ్యాడు. అనతికాలంలోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. రవితేజ, సుశాంత్, దక్ష నగార్కర్, దర్శకుడు సుధీర్ వర్మ, రచయిత శ్రీకాంత్ విస్సా, నిర్మాత అభిషేక్ నామా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్‌ల నైపుణ్యం ఈ చిత్రంలో చూడవచ్చు.
 
అభిషేక్ పిక్చర్స్ , ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్‌గా నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో రామ్‌గా కనిపించనున్నాడు.
 
రావణాసుర చిత్రంలో మొత్తం ఐదుగురు కథానాయికలు- అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షనాగార్కర్,  పూజిత పొన్నాడ నటించనున్నారు. సినిమాలో హీరోయిన్లందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది.
 
రచయితగా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన‌ ప్రాజెక్ట్‌లతో వ‌స్తున్న‌ శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం అద్భుత‌మైన‌, ఆలోచింప‌జేసేలా కథను రాశారు. సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌బోతున్నారు.
 
ఇంకా ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ ఎడిటర్.
 
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్
కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: DRK కిరణ్
సీఈఓ: పోతిని వాసు
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు
PRO: వంశీ-శేఖర్