శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (16:34 IST)

ర‌వితేజ‌తో క‌లిసి ద్విబాషా చిత్రం - విష్ణు విశాల్ ప్ర‌క‌ట‌న‌

Manu Anand, Rebba Monica, Vishnu Vishal
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా న‌టించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలయింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా తెలుగులో రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 11న విడుదలై ఆద‌ర‌ణ‌పొంది ప‌బ్లిక్ విన్న‌ర్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర‌యూనిట్ మంగ‌ళ‌వారంనాడు హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది. ముందుగా స‌క్సెస్ కేక్‌ను క‌ట్‌చేసి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
 
విష్ణు విశాల్ మాట్లాడుతూ, ఎఫ్‌.ఐ.ఆర్‌. విడుద‌ల చాలా హ్యాపీగా వుంది. త‌మిళంలో మంచి ఓపెనింగ్స్ వ‌చ్చి విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. తెలుగులోకూడా ఆద‌ర‌ణ పొందుతోంది. విడుద‌ల‌కు స‌హ‌క‌రించిన ర‌వితేజ‌, వాసుగారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం. క‌రోనా మూడో వేవ్ త‌ర్వాత థియేట‌ర్ ఓన‌ర్లు, పంపిణీదారులు మా సినిమా ప‌ట్ల ఆనందంగా వున్నార‌ని చెప్ప‌డం మా రెండున్న‌ర ఏళ్ళ కృషి ఫ‌లించింద‌నిపించింది. అదేవిధంగా ఈ సినిమా పోస్ట‌ర్ ను బ‌ట్టి కొంత‌మంది ముస్లిం సోద‌రులు కాంట్ర‌వ‌ర్సీ గా భావించారు. వారికి క్ష‌మాప‌ణ చెబుతున్నాం. సినిమాను చూస్తే మీకే అర్త‌మ‌వుతుంది. ముస్లిం సోద‌రులు అర్థం చేసుకోగ‌ల‌ని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్ర‌త్యేకంగా ఓ విష‌యం ప్ర‌క‌టిస్తున్నాం. ర‌వితేజ బేన‌ర్ ఆర్‌టి.టీమ్ వ‌ర్క్స్‌తో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెలుగు, త‌మిళ సినిమాను నిర్మించ‌బోతోంది. ఆ వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాం. ఈ సినిమాలో ఎక్కువ‌మంది తెలుగు నటీన‌టులే వుంటార‌ని తెలిపారు.
 
ద‌ర్శ‌కుడు మ‌ను ఆనంద్ తెలుపుతూ, నా తొలి సినిమా తెలుగులోనూ విడుద‌ల‌కావ‌డం ఆనందంగా వుంది. ఇటీవ‌లే మా పోస్ట‌ర్ గురించి వివాదాస్ప‌దం అయింది. అది ఏ ఒక్క‌రినీ ఉద్దేశించి పెట్టిందికాదు. అందుకు మ‌రోసారి క్ష‌మాప‌ణ తెలియ‌జేస్తున్నాను. ఈ సినిమా చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది అన్నారు.
 
అభిషేక్ పిక్చ‌ర్స్ సిఇ.ఓ. వాసు మాట్లాడుతూ, తెలుగులో 262 థియేట‌ర్ల‌లో మా బేన‌ర్ ద్వారా విడుద‌ల చేశాం. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాం. మంచి సినిమా ఏ భాష నుంచి వ‌చ్చినా తెలుగువారు ఆద‌రించ‌డానికి ముందుంటారు. రివ్యూలు కూడా బాగా స‌పోర్ట్‌గా వ‌చ్చాయి. పోటీ సినిమాలు వున్నా మా ఎఫ్‌.ఐ.ఆర్‌. ప‌బ్లిక్ విన్న‌ర్ గా నిలిపిన ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాం. విష్ణువిశాల్ అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. గౌత‌మ్‌మీన‌న్ త‌న డైలాగ్ డెలివ‌రీలో ప్ర‌త్యేక‌త‌ను చూపించారు. తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆనంద్ బాగా డీల్ చేశాడు. త‌మిళ‌నాడులో మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది` అని తెలిపారు.
 
 న‌టి రెబ్బా మోనిక మాట్లాడుతూ, ఈ సినిమాకు మంచి పేరు వ‌చ్చింది. అందుకే ప‌బ్లిక్ విన్న‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో చ‌క్క‌టి మెసేజ్ కూడా వుంది అని తెలిపారు.
 
ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్ర‌వంతి మాట్లాడుతూ, రిలీజ్‌కు స‌హ‌క‌రించిన ర‌వితేజ‌గారికి, వాసుగారికి మ‌రోసారి ధ‌న్య‌వాదాలు. టీమ్ ఎఫెర్ట్‌తో మంచి విజ‌యం సాధించామ‌ని తెలిపారు.