శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (17:37 IST)

మంటల్లో చిక్కుకున్న తల్లీకూతుర్ని కాపాడిన కానిస్టేబుల్

పంజాగుట్టలో శనివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి కానిస్టేబుల్ తన కుమార్తెను రక్షించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
తల్లి కూతురు మంటల్లో చిక్కుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ అప్రమత్తమై..అపార్ట్మెంట్ టెర్రస్ పైకి ఎక్కి.. అక్కడి నుంచి నాలుగో ఫ్లోర్ కి చేరుకున్నాడు.
 
అనంతరం మంటల్లో చిక్కుకున్న తల్లీకూతురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు. ప్రాణాలకు తెగించి, ధైర్యసాహసాలను ప్రదర్శించిన కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్‌ను స్థానికులు అభినందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు.