1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (12:51 IST)

ప్రజలకు అందుబాటులోకి స్టీల్ బ్రిడ్జి.. ట్రాఫిక్ ఇబ్బందులు ఇక వుండవ్

Steel Bridge
పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో స్టీల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.17 కోట్లు మంజూరు చేశారు. స్టీల్ బ్రిడ్జిని పాత గేటు నుంచి హెచ్‌టీ లైన్‌ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది. 
 
నూతనంగా స్టీల్ బ్రిడ్జి నిర్మించడంతో పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జంక్షన్‌కు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. గ్రేవియార్డ్‌కు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు తీరుతాయి.
 
పంజాగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించడంతో… శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్‌ విద్యుత్‌ పోల్‌ వరకు రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి.