గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (11:52 IST)

చెట్టు కూలి గోడపై పడింది.. ఇద్దరు చిన్నారుల మృతి.. ఎక్కడంటే?

చెట్టు కూలి పక్కనే వున్న గోడపై పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఖమ్మం బ్రాహ్మణ బజార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. 
 
దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
 
కాగా సమాచారం అందుకున్న వెంటనే మేయర్ నీరజ, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు దిగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6)గా అధికారులు గుర్తించారు.