శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (07:54 IST)

న్యూయార్క్ ఘోరం.. అపార్టుమెంట్‌లో మంటలు... 19 మంది మృత్యువాత

అగ్రరాజ్యం అమెరికాలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. న్యూయార్క్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంబంధించింది. ఇక్కడి 19 అంతస్తులు కలిగిన బ్రాంక్స్ భవనంలో మంటలు ఉన్నట్టు చెలరేగాయి. దీంతో 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మంది వరకు గాయపడినట్టు సమాచారం. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా వుంది. 
 
ఈ అగ్నిప్రమాదం మొదటి, రెండు అంతస్తుల్లో జరిగింది. దీంతో పై అంతస్తుల్లో ఉండే ప్రజలు బయటపడేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ప్రాణనష్టం అధికంగా జరిగింది. సమచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడు చేరుకుని మంటలను ఆర్పివేశాయి.
 
ఇలాంటి దుర్ఘటన న్యూయార్క్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. ఈ అపార్టుమెంటులో మంటలు చెలరేగడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇదే విధంగా జరిగిన ఓ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయంతెల్సిందే.