1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జనవరి 3 నుంచి చిన్నపిల్లలకు కరోనా టీకాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సోమవారం నుంచి చిన్నపిల్లలకు కూడా కరోనా టీకాలు వేయనున్నారు. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 యేళ్ల మధ్య వయస్సు పిల్లలకు ఈ నెల 3వ తేదీ నుంచి కరోనా టీకాలు వేయనున్నారు. పిల్లల వ్యాక్సినేషన్ కోసం కోవిన్ రిజిస్ట్రేషన్ శనివారమే ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
15 నుంచి 18 యేళ్ల వయసు పిల్లలందరికీ జనవరి మూడో తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ గత డిసెంబరు 25వ తేదీన ప్రకటించారు. థర్డ్ వేవ్ కట్టడి కోసం, వైరస్ కొత్త పరివర్తలను నిలువరించడం కోసం, చిన్నారులను రక్షించడం కోసం ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. 
 
సోమవారం నుంచి రోజుకు 3 లక్షల మందికి ఈ టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్య ఆరోగ్య శాఖామంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. కాగా, 2007 లేదా అంతకంటే ముందు జన్మించిన చిన్నారులకు ఈ వ్యాక్సిన్లు వేసుకోవచ్చు.