జనవరి 3 నుంచి స్కూళ్లలో వ్యాక్సినేషన్ డ్రైవ్
ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్ని కుదిపేసిన కరోనా వైరస్ నుంచి చిన్నారులను కాపాడేందుకు భారత సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి జనవరి 3 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ... జనవరి 3 నుంచి రాష్ట్రంలోని స్కూళ్లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సిన్లు వేయనున్నట్లు చెప్పారు.
అలాగే, అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు జనవరి 10 నుంచి అదనపు డోసు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సూచించామని ఆయన వివరించారు.