న్యుమోనియాతో పాక్‌లో 7వేల మంది చిన్నారుల మృతి
పాకిస్థాన్‌లోని సింధ్‌లో చిన్నారులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణం న్యుమోనియో. న్యుమోనియా బారిన పడి ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 7,462 మంది పిల్లలు మరణించినట్లు సింధ్ ఆరోగ్య శాఖ అధికారి ప్రకటించారు.
అంతేకాదు 27,136 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడ్డారని చెప్పారు. ప్రాణాంతక న్యుమోనియా వైరస్ కారణంగా 2021లో సింధ్‌లో 7,462 మంది పిల్లలు మరణించారు.
ఐదేళ్లలోపు 27,136 మంది పిల్లలు న్యుమోనియా బాధితులని చెప్పారు. యునిసెఫ్ ప్రకారం, న్యుమోనియా బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాల వల్ల వస్తుంది. పిల్లల ఊపిరితిత్తులు చీము, నీటితో నిండిపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.