మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (12:02 IST)

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం - బాయిలర్ పేలి 12 మంది మృతి

blast
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ బాయిలర్ పేలిన ప్రమాదంల 12 మంది మృత్యువాతపడ్డారు. హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మీరట్ రేంజ్ ఐజీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
 
ఆ సమయంలో ఘటనా స్థలంలో 25 మంది కార్మికులు ఉన్నారన్నారు. ఈ బాయిలర్ పేలుడు ధాటికి చుట్టుపక్కనల ఉన్న పలు ఫ్యాక్టరీల పైకబ్బులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారణ పూర్తయితేగానీ వెల్లడించలేమన్నారు.