బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం - 40 మంది మృతి

blast
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 40 మందికిపైగా చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. బంగ్లాలోని చిట్టగాంగ్ ఓ ఉన్న ఓ షిప్పింగ్ కంటైనర్‌ డిపోలో నిల్వ ఉంచిన భారీ రసాయన పదార్థాలు ఒక్కసారిగా ఉన్నట్టుండి పేలిపోయాయి. 
 
ఈ భారీ పేలుడు ధాటికి 40 మందికిపైగా మృత్యువాతపడగా, మరో 300 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత సీతాకుందంలోని కంటైనర్‌ డిపోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతం చిట్టగాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రసాయన పదార్థాలు కలిగిన అనేక కంటైనర్లను నిల్వ ఉంచుతారు. వీటిలో ఓ కంటైనర్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికిపై పైగా పోలీసులు గాయపడినట్టు సమాచారం.