1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Waliullah Khan, convicted in 2006 Varanasi blasts case, awarded death sentence

వారణాసి బాంబు పేలుళ్ళ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

hang
గత 2006లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన వలీ ఉల్లా ఖాన్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో వలీ ప్రధాన సూత్రధారి కావడంతో ఆయనకు ఘజియాబాద్ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. 
 
2006లో జరిగిన ఈ పేలుళ్లలో 20 మందికిపై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా వంద మందికిపై గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా, కేసు విచారణ ఘజియాబాద్ కోర్టులో సాగింది. ఈ మూడు కేసుల్లో ఏ1గా వలీ ఉన్నారు. ఇందులో తొలి కేసులో ఉరిశిక్ష విధించగా, రెండో కేసులో జీవిత ఖైదు, జరిమానా విధించింది. 
 
మూడో కేసులో సరైన సక్ష్యాధారాలు లేకపోవడంతో వలీని నిర్దోషిగా విడుదల చేసింది. వారణాసి పేలుళ్ల తర్వాత ఈ కేసులో వలీ తరపున విచారించేందుకు ఏ ఒక్క న్యాయవాది ముందుకురాలేదు. దీంతో ఈ కేసు విచారణను ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ కోర్టు బదిలీ చేసింది. ఇపుడు ఈ కేసు కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మల్టీప్లెక్స్‌లో సినిమా చూపిస్తామంటూ.. అనాథ విద్యార్థినిపై అత్యాచారం