గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 మే 2022 (10:38 IST)

నవాజ్ షరీఫ్ శిక్ష రద్దు : పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

nawaz sharief
పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌పై ఉన్న పలు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో లండన్‌లో ఉంటున్నారు. దీంతో ఆయనకు కోర్టు విధించిన శిక్షలను రద్దు చేసింది.
 
మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ ప్రభుత్వం స్థానంలో నవాజ్ షరీఫ్‌కు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి షరీఫ్ సోదరుడు షెబాజ్ షరీఫ్ గద్దెనెక్కారు. దీంతో లండన్‌‍లో ఉన్న షరీఫ్ తిరిగి పాకిస్థాన్‌లో కాలుమోపి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని నయా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవాజ్ షరీఫ్‌పై గత ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో కోర్టులు విధించిన శిక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది. లేదంటే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. శిక్షను తప్పుగా విధించడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ఆశ్రయించే అవకాశాన్ని నవాజ్ షరీఫ్‌కు కల్పించాలని యోచిస్తుంది.