మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:39 IST)

కాశ్మీర్ అంశం తేలితేనే భారత్‌తో సఖ్యత సాధ్యం : పాక్ కొత్త ప్రధాని షాబాజ్

Shehbaz Sharif
దాయాది దేశమైన పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన బాధ్యతలు చేపట్టారో లేదో భారత్‌పై ఒంటికాలిపై లేచారు. వివాదస్పద కాశ్మీర్ అంశం తేలితేనే భారత్‌తో సఖ్యత సాధ్యమవుతుందని ఆయన ప్రకటించారు. 
 
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నవాజ్ షరీఫ్ పార్టీ అధినేతగా ఉన్న షాబాజ్ షరీఫ్ ప్రధాని పీఠమెక్కారు. 
 
ఆయనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభకాంక్షలు తెలిపారు. ఉగ్రవాదానికి తావులేదని పేర్కొంటూ భారత్ శాంతి సుస్థిరతను కోలుకుంటుదని చెప్పారు. "అందుకే మనం అభివృద్ధి సవాళ్ళపైనే దృష్టినిలిపి, మన ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడదాం" అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 
 
అయితే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షాబాజ్ షరీప్ మాత్రం మరోలా స్పందించారు. కాశ్మీర్ అంశం పరిష్కారమైతేనే భారత్‌తో సఖ్యత సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాకుండా, ఆర్టికల్ 370 రద్దు, అనేక చర్యల ఫలితంగా కాశ్మీర్‌లో ప్రజలు నెత్తురోడుతున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశం తేలాకే ఇతర అంశాలపై దృష్టిపెడదామంటూ ఆయన తేల్చి చెప్పారు.