1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (09:44 IST)

నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్

nawaz sharif
పనామా పేపర్స్ కేసులో 72 ఏళ్ల పాకిస్థాన్ ముస్లిం లీగ్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు జులై 2017లో పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనేక అవినీతి కేసులు పెట్టింది. 
 
అలాగే ఆరోగ్య పరంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు నవాజ్‌కు నాలుగు వారాల అనుమతి మంజూరు చేయడంతో 2019లో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లిపోయారు.
 
తాను పాకిస్థాన్‌కు తిరిగి వస్తానని లాహోర్ హైకోర్టుకు నవాజ్ గతంలో హామీ ఇచ్చారు. కాని పాకిస్థాన్ దేశానికి నవాజ్ షరీఫ్ రాలేదు. ఎట్టకేలకు తన సోదరుడు షెహబాజ్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో నవాజ్ పాక్ వచ్చేందుకు వీలుగా మార్గం సుగమమైంది. 
 
తద్వారా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరలో స్వదేశానికి రానున్నారు. పాక్ 23వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ తన అన్నయ్య అయిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కోసం సంచలన ఆదేశాలు జారీ చేశారు.
 
ఈద్ తర్వాత పాకిస్థాన్‌కు తిరిగి వచ్చే దిశగా నవాజ్ షరీఫ్‌కు దౌత్యపరమైన పాస్‌పోర్ట్ జారీ చేయాలని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు.