ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2025 (18:30 IST)

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే కథతో చంద్రహాస్ కాయిన్ చిత్రం

Chandrahas, Sai Rajesh and others
Chandrahas, Sai Rajesh and others
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న చిత్రం కాయిన్. శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం  గ్లింప్స్, టైటిల్ పోస్టర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ గారితో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ‘కాయిన్’ చుట్టూ ఇంత జరిగిందా? అని కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. ట్రైలర్ వచ్చిన తరువాత చిత్రంపై మరింత అంచనాలు పెరుగుతాయని నమ్మకంగా ఉన్నాను అని అన్నారు.
 
చంద్రహాస్ మాట్లాడుతూ .. యథార్థ సంఘటనల ఆధారంగా మా దర్శకుడు జైరామ్ ఈ మూవీని తీస్తున్నారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథను రాసుకున్నారు. జైరామ్ పనితనం నాకు చాలా నచ్చింది. జైరామ్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్ అవుతారు. కాయిన్ ఫస్ట్ ఫ్లిప్‌ను లాంచ్ చేసేందుకు వచ్చిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. నిమిషి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద స్థాయికి వెళ్తారు. 
 
శ్రీకాంత్ రాజా రత్నం ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయనకు కథపై చాలా నమ్మకం ఉంది. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల చిత్రాలను చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. కథను, సినిమాల్ని పూర్తిగా నేనే ఓకే చేస్తాను. నాన్న అప్పుడప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను’ అని అన్నారు.
 
దర్శకుడు జైరామ్ చిటికెల మాట్లాడుతూ .. ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది? అనే నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. మున్ముందు ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు చెబుతాను. నేను చంద్రహాస్ చేసిన ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్‌ని చూశాను. అందులో అతని ఎనర్జీ చూసి ఈ కథను చెప్పాను. ఈ కథను నాకంటే ఎక్కువగా చంద్రహాస్ నమ్మారు. నిమిషి మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతోంది. సమ్మర్‌లో మా సినిమాని రిలీజ్ చేస్తాం’ అని అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ నిమిషి జాకియాస్ మాట్లాడుతూ .. ‘దర్శకుడు జైరామ్ నా స్నేహితుడు. నాలుగేళ్ల నుంచి మా బంధం కొనసాగుతూ ఉంది. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన జైరామ్‌కు థాంక్స్. చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయాలని జైరామ్ ఐదు రోజుల క్రితమే చెప్పాడు. రెండ్రోజుల క్రితమే పుటేజ్ పంపించాడు. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేసి ఈ ఫస్ట్ ఫ్లిప్ కోసం పని చేశాను. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ వస్తోంది’ అని అన్నారు.
 
లైన్ ప్రొడ్యూసర్ గంగాధర్ మాట్లాడుతూ .. ‘‘కలర్ ఫోటో’కి సాయి రాజేష్ నన్ను లైన్ ప్రొడ్యూసర్‌గా తీసుకున్నారు. జైరామ్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. జైరామ్ తీసిన పాటలు చంద్రహాస్‌కు బాగా నచ్చాయి. జైరామ్ చెప్పిన కథ విని చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. జైరామ్ టాలెంట్‌ను గుర్తించిన చంద్రహాస్‌కు హ్యాట్సాఫ్. కొత్త, చిన్న చిత్రాలకు మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ‘కాయిన్’ చిత్రాన్ని కూడా మీడియా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను’ అని అన్నారు.