మంగళవారం, 4 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2025 (18:50 IST)

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

Atharva Murali, Lavanya Tripathi
Atharva Murali, Lavanya Tripathi
అథర్వా మురళీ ఇటీవల టన్నెల్ అంటూ ఓ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చి తమిళ్ లో మంచి విజయం సాధించారు. తమిళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘టన్నెల్’ తెలుగు ఆడియెన్స్ ముందుకు సెప్టెంబర్ 19న రాబోతోంది. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
 
ఇప్పటికే రిలీజ్ చేసిన ‘టన్నెల్’ తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ చూస్తేనే చాలా గ్రిప్పింగ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీగా ఉందని అర్థం అయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. సినిమా ఆద్యంతం గ్రిప్పింగ్‌గా ఉందని, మంచి మెసెజ్‌ను కూడా ఇచ్చేలా అద్భుతంగా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు.
 
లావణ్య త్రిపాఠి, అథర్వ కాంబో తమిళ్ ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు తెలుగులో అలరించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు అందరూ వావ్ అనాల్సిందే. జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. కలైవానన్ ఈ సినిమాకు ఎడిటర్. సెప్టెంబర్ 19న ఈ మూవీని గ్రాండ్‌గా తెలుగులో రిలీజ్ చేయనున్నారు.