గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (20:22 IST)

కరాచీలో మహిళ ఆత్మాహుతి దాడి-నలుగురు మృతి

bomb blast
పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చైనీయులే లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

మంగళవారం ఉదయం కరాచీ యూనివర్సిటీ పరిధిలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఒక వ్యాన్‌లో పేలుడు జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్ స్థానికులకు చైనా భాష నేర్పేందుకు ఏర్పాటైంది. 
 
కాగా, ఈ పేలుడుకు తామే కారణమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. షరీ బలూచ్ (బ్రమ్ష్) అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని తెలిపింది. ఈ తీవ్రవాద సంస్థ నుంచి ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడటం ఇదే మొదటిసారి. మహిళ ఆత్మాహుతి దాడితో తమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్లు బీఎల్ఏ ప్రకటించింది.