1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Dada Dhamaka' featuring Nargis Fakhri and Balakrishna: First Single

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nargis Fakhri and Balakrishna
Nargis Fakhri and Balakrishna
నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’ షూటింగ్ దాదాపు పూర్తయింది. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గతంలో ‘వీరసింహారెడ్డి’తో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి.
 
 ఇప్పుడు బాలకృష్ణ ‘దాదా ధమాకా’తో మ్యూజికల్ హీట్ పెంచారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో సాగుతూ ఆకట్టుకుంటోంది.
 
బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో మంచి మ్యూజికల్ జర్నీని కొనసాగిస్తున్న తమన్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇన్ఫెక్షియస్ బీట్స్, క్యాచీ రిథమ్స్‌తో పాటను ఫుల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌గా రూపొందించారు. పాటలోని పార్టీ మూడ్‌కు తమన్ సంగీతం అద్భుతంగా కుదిరింది. నర్గీస్ ఫక్రీ గ్లామర్, బాలకృష్ణ తనదైన ఎనర్జీతో డ్యాన్స్ ఫ్లోర్‌పై సందడి చేశారు.
 
రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పాటకు సరదా టచ్‌ను తీసుకొచ్చాయి. బాలకృష్ణ మౌనంగా ఉండటంపై నర్గీస్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పాట పాడుతూ డ్యాన్స్‌లో పాల్గొనాలని ఆయన్ని ప్రోత్సహించేలా సాహిత్యం సాగుతుంది. రజిని శ్రీ పూర్ణిమ తన వాయిస్‌తో పాటను మరింత ఆకట్టుకునేలా చేశారు. బాలకృష్ణ కూడా ఈ పాటలో కొంత భాగాన్ని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత.
 
పాట విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. శేఖర్ వీజే మాస్టర్ ఈ పాటకు స్టైలిష్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా కొరియోగ్రఫీ అందించారు. సన్‌గ్లాసెస్, సిగార్‌తో బాలకృష్ణ ఫుల్ పార్టీ అవతార్‌లో కనిపించగా, నర్గీస్ ఫక్రీ తన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
 
బాలకృష్ణ వాయిస్, స్టైలిష్ మూవ్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు మరింత మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి. మరోవైపు నర్గీస్ తన గ్లామర్, గ్రేస్‌తో పాటను విజువల్ ట్రీట్‌గా మార్చారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ‘దాదా ధమాకా’ ఫుల్ ఎనర్జీతో సాగుతూ మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్ సాంగ్‌గా నిలిచేలా ఉంది.
 
ఈ సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వీవెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.
 
భారీ అంచనాల మధ్య ‘దాదా’ డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘దాదా ధమాకా’ పాటతో మేకర్స్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫుల్ ఎనర్జీతో ప్రారంభించారు.
 
నటీనటులు:నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, నర్గీస్ ఫక్రీ
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్