గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మూడేళ్ల బాలికను సజీవంగా పాతిపెట్టిన అమ్మ.. నాన్నమ్మ

victim
బీహార్ రాష్ట్రంలోని సారన్ నగరంలో దారుణం జరిగింది. మూడేళ్ళ బాలికను కన్నతల్లితో పాటు నానమ్మలను సజీవింగా శ్మశానంలో పాతిపెట్టారు. ఆ సమయంలో ఆ బాలిక కేకలు విన్న స్థానికులు ఒక్క పరుగున వచ్చిన ఆమెను కాపాడారు. ఈ దారుణం కోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికలో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ పాతిపెట్టేశారు. బాధితురాలి ఏడుపులు విన్న మహిళలు దెయ్యం అని భయపడ్డారు. అనంతరం స్థానికులు అక్కడ చేరుకుని మట్టిని తొలగించి చూడగా బాలిక బతికే ఉంది. వెంటనే కోపా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. 
 
పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలు తన పేరు లాలీగా చెప్పింది. తన తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖా దేవీ అని వెల్లడించింది. ఊరు పేరు చెప్పలేకపోయింది. బాలిక కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 'అమ్మ, నానమ్మ బయటకు వెళ్దాం అని తీసుకెళ్లారు. అనంతరం నన్ను శ్మశానం వద్దకు తీసుకెళ్లి నోటిలో మట్టిని నింపి పాతిపెట్టారు' అని బాధితురాలు లాలీ తెలిపింది.