బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జులై 2022 (08:40 IST)

పంచాయతీ తీర్పు - గ్రామ పెద్దల సమక్షంలో వ్యక్తి సజీవదహనం

fire
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పుతో గ్రామ పెద్దల సమక్షంలోనే ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ దారుణం నాగోన్‌ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోర్​లాలుగావ్ గ్రామానికి చెందిన రంజిత్‌ బార్దోలోయ్‌ అనే వ్యక్తిపై హత్యారోపణలు ఉన్నాయి. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేల్చి.. అతడిని అందరి ముందే సజీవ దహనం చేశారు. అనంతరం పూడ్చిపెట్టారు.
 
ఈ ఘోరంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీరం 90 శాతం కాలిపోయినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నన్నామని పోలీసులు తెలిపారు.
 
'బోర్​లాలుగావ్‌లో బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్ల హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం' అని డీఎస్పీ ఎం.డాస్‌ వెల్లడించారు.