గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పెళ్లింట విషాదం - సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం

deadbody
పంజాబ్ రాష్ట్రంలోని ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని విక్రమ్ పూర్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఫజిల్కా జిల్లాలోని జలాలా‌బాద్ ప్రాంతంలో శనివారం జరిగిన ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనపై నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విక్రమ్‌పూర్‌లో గ్రామంలో చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్టు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.