శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జూన్ 2022 (11:13 IST)

అవినీతి కేసులో ఐఏఎస్ అరెస్టు - మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

పంజాబ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి అరెస్టు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు తీవ్ర మనస్తాపానికిగురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి తుపాకీతోనే కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చండీఘడ్‌‍లో వెలుగు చూసింది. 
 
గత 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ పోప్లీ పంజాబ్‌లో అధికారిగా ఉన్నారు. ఈయనను ఓ అవినీతి కేసులో ఇటీవల పంజాబ్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈయన రిమాండ్ ముగియనుంది. 
 
ఈ క్రమంలో ఆయన నివాసంలో తనిఖీలు చేసేందుకు విజిలెన్స్ అధికారులు ఆయన నివాసానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్ పొప్లీ తనయుడు కార్తీక్ పొప్లీ తన తండ్రి తుపాకీ తీసుకుని తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాద ఘటనతో పొప్లీ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులో తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు.