గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (12:59 IST)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ సూత్రధారి అరెస్టు

arrest
సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నివీరులు (అగ్నిపథ్)కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాకాండ చోటుచేసుకుంది. ఈ హింసాకాండకు సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇపుడు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. 
 
ఏపీలోని నర్సారావు పేటలో సాయి డిఫెన్స్ అకాడెమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావును ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన మాజీ సైనికోద్యోగి కావడం గమనార్హం. పైగా, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన హింసాకాండకు పథక రచన చేసింది ఏపీలోనని తేలిపోయింది. 
 
మరోవైపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మరికొంత మంది అభ్యర్థులను గుర్తించే పనిలో పోలీసులున్నారు.