గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (16:08 IST)

మలయాళ యంగ్ హీరో శరత్ చంద్రన్ అనుమానాస్పద మృతి

Sarath Chandran
Sarath Chandran
యంగ్ హీరో మరణంతో మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళం యంగ్ హీరో శరత్ చంద్రన్ శుక్రవారం అతని నివాసంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అతని వయసు 37 సంవత్సరాలు. శరత్‌ మరణానికి ఇంకా కారణాలు తెలియరాలేదు.
 
శరత్‌కు తండ్రి చందన్, తల్లి లీలతోపాటు సోదరుడు ఉన్నారు. లిజో జోస్ పెల్లిస్సేరి యాక్షన్ డ్రామా సినిమా అంగమలీ డైరీస్‌లో శరత్ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శరత్. కొచ్చికి చందిన శరత్ చంద్రన్ గతంలో ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. 
 
డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా పనిచేసిన అతను.. అనిస్య సినిమాతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేశాడు. ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
యంగ్ హీరో మరణంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 
 
మాలీవుడ్ నటుడు ఆంటోనీ వర్గీస్ పెపే శరత్ మరణం పట్ల సంతాపం తెలియచేశాడు. శరత్ మృతితో అభిమానులు షాకయ్యారు. సోషల్ మీడియా వేదికగా నటుడికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.