బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (17:58 IST)

శ్రీ సింహ కోడూరి, స‌ముద్ర‌ఖ‌ని కాంబినేష‌న్‌లో దొంగలున్నారు జాగ్రత్త

Simha Koduri, Samudrakhan
Simha Koduri, Samudrakhan
డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌, సునీత తాటి గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న  చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు.
 
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు గతంలోనే నిర్మాతలు తెలిపారు. తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒకవైపు సింహ కోడూరి, మరో వైపు సముద్రఖని ఒకే మొహంగా కనిపించడం ఆసక్తికరంగా వుంది. సింహా కాస్త సీరియస్‌గా కనిపిస్తుండగా సముద్రఖని నుదుటిపై వేళ్లు పట్టుకుని విసుగు చెందినట్లు కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. పోస్టర్‌లో కారును కూడా గమనించవచ్చు.
 
ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
 
ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తుండగా, అత్యున్నత సాంకేతిక బృందం పని చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్ గా గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తారాగణం: శ్రీ సింహ కోడూరి, ప్రీతి అస్రాణి, సముద్రఖని
సాంకేతిక విభాగం:
దర్శకత్వం : సతీష్ త్రిపుర
నిర్మాతలు: డి సురేష్ బాబు, సునీత తాటి
బ్యానర్లు: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ , మంజార్ స్టూడియోస్
సంగీతం: కాల భైరవ
డీవోపీ: యశ్వంత్ సి
ఎడిటర్: గ్యారీ బీ హెచ్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, చిత్రా సుబ్రమణ్యం, వంశీ బండారు
లైన్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ డి
పీఆర్వో: వంశీ-శేఖర్