1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:54 IST)

నిర్మాత‌ల గిల్డ్ క్లోజ్ అవుతుందా!

Producers
Producers
తెలుగు సినిమాల షూటింగ్‌లు బంద్‌! అంటూ నిర్మాత‌ల మండ‌లిలోని కొంత‌మంది గిల్డ్‌గా ఏర్ప‌డి ప్ర‌క‌టించిన విష‌యంతెలిసిందే. ఇందులో గిల్డ్‌కు నాయ‌కుడు దిల్‌రాజు. అయితే ఆయ‌న సినిమా మాత్రం త‌మిళ విజ‌య్ హీరోగా   త‌న షూటింగ్ జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించాడు. దీనిపై నిర్మాత‌ల‌మండ‌లి మండిప‌డుతున్నారు. వారంతా ఇప్పుడు ఏక‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంత‌కుముందే సీనియ‌ర్ నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ కూడా అస‌లు గిల్డ్ ఎందుకు ఏర్ప‌డిందో త‌న‌కు తెలియ‌ద‌నీ, తాను మాత్రం నిర్మాత‌ల మండ‌లిలోనే వున్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
 
మ‌రోవైపు చిన్న నిర్మాత‌లంద‌రూ త‌మ షూటింగ్‌లు జ‌రుపుకుంటామ‌నీ, గిల్డ్ నిర్మాత‌లులా కోట్లు రూపాయ‌లు ఇచ్చి తాము హీరోల‌ను తెచ్చుకోవ‌డంలేద‌ని అంటున్నారు. ఇంకోవైపు 24 క్రాఫ్ట్‌కు చెందిన సినీకార్మిక స‌మాఖ్య అద్య‌క్ష‌, కార్య‌ద‌ర్శ‌కులు వ‌ల్ల‌భ‌నేని అనిల్‌, దొర మాత్రం త‌మ‌కు ఛాంబ‌ర్ నుంచి షూటింగ్‌లు బంద్ అని ఎటువంటి స‌మాచారం లిఖిత‌పూర్వ‌కంగా రాలేద‌ని తేల్చిచెప్పారు. ఇంకోవైపు తెలంగాణ ఛాంబ‌ర్ మాత్రం అస‌లు గిల్డ్ అనేది సంస్థేకాదు. అది కొంద‌రు స్వార్థ‌ప‌రుల అడ్డా అంటూ తేల్చిచెబుతున్నారు. ఇన్ని వివాదాల మ‌ద్య ఇప్పుడు గిల్డ్ నిర్మాత‌లు స‌మావేశం అవ్వాల్సి వ‌చ్చింది. అందుకు ప్లేస్ కూడా మార్చారు. మీడియాకు దూరంగా స‌మావేశం వేశారు.
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఇలా షూటింగ్‌లు ఆప‌డం కార్మికుల‌కు అన్యాయం చేసిన‌ట్ల‌వుతుంద‌ని  మెగాస్టార్ చిరంజీవి స‌న్నిహితుల‌తో అన్నార‌ని తెలుస్తోంది. ప‌ర్యావ‌సానం ఏదైనా గిల్డ్ నిర్మాత‌లు మంగ‌ళ‌వారంనాడు ఓ స్టూడియోలో అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అయ్యారు. దిల్‌రాజుతోపాటు ప‌లువురు నిర్మాత‌లంతా హాజ‌ర‌య్యారు. 
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు, గిల్డ్ అనేది వుండ‌బోద‌ని తెలుస్తోంది. మొద‌టి నుంచి నిర్మాత‌ల‌మండ‌లి (ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌) ఎలా వుందో దానిప్ర‌కార‌మే అన్ని ప‌నులు జ‌ర‌గాల‌ని ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌నుంచి ఒత్తిడి వ‌స్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల కార్మికులు ఇబ్బంది ప‌డ్డారు. అందుకే మాన‌వ‌తా దృక్ప‌థంతో వారికి ప‌ని క‌ల్పించే బాద్య‌త త‌మ‌దేన‌ని ప‌లువురు నిర్మాత‌లు సూచించార‌ని తెలుస్తోంది.