షూటింగ్‌లు చేసుకోవచ్చు - కార్మిక సమాఖ్య
ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించినట్టుగా నేటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిచిపోనున్నాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు తెలిపింది. ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ చిత్రాల షూటింగ్ లు నిలిపివేస్తున్నట్టు ఫిలిం చాంబర్ ప్రకటించింది. అధిక నిర్మాణ వ్యయం భరించలేకపోతున్నామని కొంతకాలంగా నిర్మాతలు వాపోతున్నారు. షూటింగుల నిలిపివేతపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. చిన్న, పెద్ద నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చారని వెల్లడించారు. మళ్లీ షూటింగ్స్ ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు. 24 క్రాఫ్ట్స్ తో మాట్లాడి నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు.
షూటింగ్‌లు చేసుకోవచ్చు_ దొరై
ఇదిలా వుండగా, నేడు తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఎన్. దొర మాట్లాడుతూ, ఛాంబర్ నుంచి ఎటువంటి మెయిల్స్ కానీ, లిఖితపూర్వకంగా ఎటువంటి సమాచారం కానీ మాకు రాలేదు. కనుక నిర్మాతలు ఎవరైనా షూటింగ్ వుందని పిలిస్తే వెళ్ళి పనిచేసుకోవచ్చు. అభ్యంతరం లేదు. ఏదైనా ఛాంబర్ నుంచి సమాచారం వస్తే అప్పుడు మేమే మరలా కార్మికులందరికీ తెలియజేస్తామని దొర ఆడియో టేప్‌ను విడుదల చేశారు.
ప్యాచ్‌వర్క్‌లు జరుగుతున్నాయి.
ఇదిలా వుండగా, కొన్ని సినిమా షూటింగ్‌లు మిగిలి పోయిన ప్యాచ్‌వర్క్‌లు జరుగుతున్నాయి. ఈరోజు జరగాల్సిన ప్రముఖ సంస్థ షూటింగ్ హైదరాబాద్‌లో వర్షం వల్ల కాన్సిల్ చేశారు. రెండు రోజుల్లో మరలా తెలియజేస్తామని సిబ్బంది తెలియజేయడం విశేషం.