ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (11:09 IST)

'వారసుడు' షూటింగ్ కోసం వైజాగ్‌లో తమిళ హీరో విజయ్...

vijay
కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ విశాఖపట్టణంలో కనిపించారు. తాను నటిస్తున్న కొత్త చిత్రం 'వారసుడు' (తమిళంలో 'వారిసు') చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఇక్కడకు వచ్చారు. ఆయన చెన్నై నుంచి వైజాగ్‌కు విమానంలో రాగా, ఆయనను గుర్తించిన అభిమానులు కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో విజయ్ వైజాగ్‌కు వచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది. 
 
దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా "వారసుడు" చిత్రం తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ఖుష్బూ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.