గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (11:19 IST)

ఎన్‌.టి.ఆర్‌.తో క‌లిసి న‌టిస్తా - నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌

Nandamuri Kalyanram and team
Nandamuri Kalyanram and team
నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఈరోజు శ్రీ‌తిరుమ‌ల శ్రీ‌నివాసుని ద‌ర్శించుకున్నారు. కుటుంబ‌స‌భ్యుల‌ తోనూ, త‌న తాజా చిత్రం `బింబిసార‌` టీమ్‌తోనూ ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ, ఆగ‌స్టు 5న మా బింబిసార సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. మా అంద‌రికీ స్వామివారి ఆశీస్సులు ఇవ్వాల‌ని కోరుకోవ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చాం. ద‌ర్శ‌నం చాలా బాగా అయింది అన్నారు. ఈ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్.టి.ఆర్‌. మీరు క‌లిసి న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు.. క‌థ కుదిరితే త‌ప్ప‌కుండా న‌టిస్తామ‌ని అన్నారు. రాజ‌కీయాల గురించి అడిగితే, ఇది స‌మ‌యం కాదు అని దాట‌వేశారు.
 
Nandamuri Kalyanram and team
Nandamuri Kalyanram and team
న‌టుడు శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ, స్వామివారి ఆశీర్వాదాలు ద‌క్కాయి.  ప్రేక్ష‌కుల ఆశీస్సులు కూడా కావాలి. పాజిటివ్‌గా వుంది. మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది. మీరంతా సినిమాను చూసి ప‌రిశ్ర‌మ‌ను బ‌తికించండి అని కోరారు.