గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (10:50 IST)

ఒక పాన్‌కు రెండు ఫోన్ నెంబర్లు.. వుంటే రూ.10వేలు పెనాల్టీ

pan card
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అంటే ఒక పాన్ కార్డుకు రెండు ఫోన్ నెంబర్లు వుండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్ కార్డు వుండకూడదు.  
 
సాధారణంగా నెంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. 
 
డిపార్ట్‌మెంట్‌ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్‌ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. 
 
ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్‌ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. ఒకవేళ మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్‌ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఆ నంబరును సరెండర్‌ చేయండి. 
 
సరెండర్‌ అంటే కార్డుని ఫిజికల్‌గా డిపార్ట్‌మెంటు వారికి పంపనవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లోనూ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే ఒక ఫారం కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేయడానికి ఇది అవసరం. దీన్ని డౌన్‌లోడ్‌ చేయండి.  
 
నంబరు ఉండటం కన్నా నంబరును దుర్వినియోగం చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. రెండు నంబర్లు, రెండు అసెస్‌మెంట్లు అనేవి పన్ను ఎగవేతకు దారి తీస్తాయి.