గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (19:49 IST)

కిసాన్ యోజన.. అకౌంట్‌లో డబ్బులు పడలేదంటే ఇలా చేయండి..

Farmers
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఖాతాలో 11వ విడత డబ్బులని మే 31వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటికీ చాలా మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. అలాంటి వారు ఏం చేయాలంటే.. ముందుగా  రైతులు హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయవచ్చు.
 
మే 31న సిమ్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి 11వ విడత 2000 రూపాయలను బదిలీ చేశారు. దేశంలోని 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.21,000 కోట్లు పంపారు. కానీ చాలామంది రైతులకు ఈ డబ్బు అకౌంట్లోకి జమ కాలేదు. 
 
చాలా మంది పేర్లు మునుపటి జాబితాలో ఉన్నాయి. కానీ కొత్త జాబితాలో లేవు. చివరిసారి డబ్బు వచ్చింది కానీ ఈసారి రాలేదు. అప్పుడు మీరు పీఎం కిసాన్ సమ్మాన్ హెల్ప్‌లైన్ నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606కు కాల్ చేయవచ్చు.
 
PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్:155261
PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011-23381092, 23382401
PM కిసాన్ కొత్త హెల్ప్‌లైన్: 011-24300606
PM కిసాన్‌కు మరో హెల్ప్‌లైన్ నెంబర్: 0120-6025109