మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (16:13 IST)

అమ్మఒడి లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్.. వెయ్యి కోత!

amma vodi
అమ్మఒడి లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడిలో మరో వెయ్యి రూపాయలు కోత పడనుంది. 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లులకు వైసీపీ సర్కార్ ఏటా రూ.15 వేల రూపాయల మొత్తాన్ని అమ్మఒడి పథకం రూపంలో ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.15 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. 
 
అయితే వివిధ కారణాలతో ఈ పథకంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో లబ్దిదారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హతల్ని పలుమార్లు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే మొత్తంలోనూ మార్పులు చేస్తోంది.
 
అమ్మఒడి పథకంలో భాగంగా మొత్తం రూ.15 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఏటా జమ చేయాల్సి ఉండగా.. ఇందులో వెయ్యి రూపాయలు కోత విధించి రూ.14 వేలే ఇస్తున్నారు. అదేమని అడిగితే స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఈ వెయ్యి రూపాయలు కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 
 
దీంతో తొలి ఏడాది నుంచే అర్హులకు లభించాల్సిన రూ.15 వేలకు బదులు రూ.14 వేలే జమ అవుతోంది. దీంతో తొలి ఏడాది నుంచే వెయ్యి రూపాయల కోతతో ఈ పథకం అమలవుతోంది.