గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (19:18 IST)

అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేల నష్టపరిహారం

ys jagan
అసని తుఫాను నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తుపాన్ బాధితుల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎవ‌రికి ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే ఆదుకోవాల‌ని సూచించారు.

ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జ‌గ‌న్‌ ఆదేశించారు. అంతేగాకుండా అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం ప్రకటించారు.
 
అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం చెల్లించాలని జగన్ అధికారులకు ఆదేశించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని, సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తోపాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పని చేసేలా చూడాలని కోరారు.